1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పృథ్వీ, ప్రియమణి జంటగా "సత్యం ఐ.పి.యస్"

వినోదం వెండితెర కథనాలు పృథ్వీరాజ్ జాతీయ ఉత్తమ నటి ప్రియమణి సత్యం సత్యం ఐపియస్ 9 స్టార్ ఫిలిమ్స్ బ్యానర్
ప్రముఖ మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా మలయాళంలో రూపొందిన "సత్యం" చిత్రాన్ని "సత్యం ఐ.పి.యస్" పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. 9 స్టార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వినయన్ దర్శకత్వంలో జి. మధు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ... ఈ చిత్రం మలయాళంలో అఖండ విజయం సాధించిందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

తన తండ్రికి పోలీసు వ్యవస్థలో జరిగిన అన్యాయాన్ని కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని మధు అన్నారు. పోలీసు బ్యాక్ డ్రాప్‌లో తయారైన ఈ చిత్రంలో ఆకట్టుకునే నాలుగు పాటలు, అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయని ఆయన వెల్లడించారు.

వెన్నెలకంటి మాటలు, పాటలు అందించిన ఈ చిత్రంలో ఆనంద్ రాజ్, కెప్టెన్ రాజ్, తిలకన్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం... జెస్సీ గిఫ్ట్.
About Writer
SELVI.M