1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

డబ్బింగ్‌ కార్యక్రమాల్లో "సునామీ"

వినోదం వెండితెర కథనాలు అంకిత కృష్ణభగవాన్ రఘుబాబు సునామీ ఎంఎ చౌదరి  జి మధుకర్
అంకిత ప్రధాన పాత్రలో, కృష్ణభగవాన్ రఘుబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "సునామీ". ఎం.ఎ. చౌదరి దర్శకత్వంలో జి. మధుకర్, శ్రీనివాసబాబులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కరణం బలరామ్ మాట్లాడుతూ... వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అంకితకు మంచి గుర్తింపును సాధించిపెడుతుందన్నారు. గోరంట్ల కృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఆడియో విజయవంతమైనట్లే... సినిమా కూడా విజయం సాధిస్తుందని బలరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు ఎం.ఎ. చౌదరి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ నడుస్తోందని డిసెంబర్ చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

శ్రీతేజ, జయప్రకాష్ రెడ్డి, జీవా, చిత్రం శ్రీను, గౌతం రాజు, శివపార్వతి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు... రవీంద్రదేశాయ్, డాన్స్... ప్రేమ్ గోపి.
About Writer
SELVI.M