"కుబేరులు" చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్
"అదిరిందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైల" చిత్రాల తర్వాత హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో తెరముందుకు వస్తోన్న చిత్రం "కుబేరులు" (వీళ్ళకు అన్నీ అప్పులే). ఇందులో అలీ, కృష్ణభగవాన్‌లు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. గోదావరి టాకీస్‌పై కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.....కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దామని, సెన్సార్ సభ్యులు చూసి తొలిసారిగా తన చిత్రానికి యు సర్టిఫికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందన్నారు. తప్పకుండా "కుబేరులు" మంచి విజయాన్ని సాధించిపెడతారనే విశ్వాసం తనకుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ... తొలుత ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నామని, డిసెంబర్ నాలుగో తేదీ అయితే బాగుంటుందనే నిర్ణయం తీసుకుని ఆ తేదీనే రిలీజ్ చేయనున్నామని అన్నారు. చక్కని హాస్య ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు చెప్పారు. సీనియర్ నటి జ్యోతిలక్ష్మి ఐటంసాంగ్‌లో నటించిందని వారు తెలిపారు. సినిమా అయిపోవడానికి 10 నిమిషాల ముందు ఈ పాట వస్తుందని తెలిపారు.