రాజశేఖర్, భూమిక జంటగా "నా స్టైలే వేరు"
|
డాక్టర్ రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా, జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో మాగంటి గోపీనాథ్ నిర్మిస్తోన్న చిత్రానికి "నా స్టైలే వేరు" అనే పేరును ఖరారు చేశారు.
ఈ సందర్భంగా సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు, సమకూరుస్తున్న రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ... కథ, కథనాల్లో కొత్తదనం, కథానాయిక పాత్ర స్వరూప, స్వభావాలు కొత్తగా కన్పిస్తాయని చెప్పారు.
తన జీవితంలో జరిగిన ఓ సంఘటనతో రాజశేఖర్ తన లైఫ్ స్టైల్‌ను ఎలా మార్చుకున్నాడు... ? అలా మార్చుకున్న వ్యక్తికి అనుకోని పరిస్థితుల్లో ఓ అమ్మాయి (భూమిక) అతని జీవితంలోకి ప్రవేశిస్తే... అతని జీవితం మళ్ళీ ఎటువైపు దారితీసింది...? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని కోన వెంకట్ చెప్పారు. రాజశేఖర్‌లో మాస్‌తో కూడిన కామెడీ పండించడం అనేది రచయితగా తనకు ఛాలెంజ్ లాంటిందని వెంకట్ తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ.... కథాపరంగా ఈ సినిమాకి పేరును ఖరారు చేశామన్నారు. డిసెంబర్ 15వ తేదీనుంచి తాజా షెడ్యూల్ ప్రారంభించామని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో.... బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, విజయ్ కుమార్, దేవరాజ్, చలపతిరావు, ఆహుతిప్రసాద్, జీవా, బెనర్జీ, విజయరంగరాజు, పృథ్వీరాజ్, అమిత్, ఎం.ఎల్.ఎ. సాయన, జయవాణి, అనిత తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ... దిసిర ప్రొడక్షన్ యూనిట్, కథా సహకారం... గోపిమోహన్, కెమేరా... ఎస్. అరుణ్‌కుమార్, సంగీతం... అనూప్, పాటలు... సుద్దాల, చైతన్యప్రసాద్, భాస్కరభట్ల, చిర్రావూరి ఆజకుమార్.