నిర్మాణ, పత్రికారంగాల్లో అడుగెట్టిన భూమిక!
ప్రముఖ కథానాయిక భూమిక సినీ నిర్మాణ రంగంలోకి, పత్రికా రంగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా హైటెక్స్‌లోని నొవెటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు "డౌన్‌టౌన్ ఫిలింస్" పతాకాన్ని, ఎన్టీఆర్. "మాయానగర్" సినిమా మ్యాగజైన్‌ను, వి.వి.వినాయక్ "మాయానగర్" డాట్‌కామ్‌ను ఆవిష్కరించారు.
నిర్మాతగా మారుతున్న భూమిక దంపతులు పత్రిక, నిర్మాణ రంగాల్లో విజయం సాధించాలని డి. రామానాయుడు ఆశీర్వదించారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ... సినిమా పరిశ్రమలో కొత్త నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రావాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకడినని, ఎందుకంటే కొత్తవాళ్లతో సినిమాలు తీస్తే పరిశ్రమలో కొందరు బతుకుతారని చెప్పారు.
వి. వి. వినాయక్ స్పందిస్తూ.. ఈ వెబ్‌సైట్ నిర్మాత దర్శకులకు ప్రయోజనాత్మకంగా ఉంటుందని ఆశించారు.
భూమిక భర్త భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఎటో వెళ్తున్న తన ప్రయాణాన్ని భూమిక సినిమా రంగంవైపు తీసుకొచ్చిందన్నారు. తమ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఠాకూర్ అభిలాషించారు.
భూమిక మాట్లాడుతూ... తొమ్మిది సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలో ఉన్న తాను ఓ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నానన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇలియానా, పూనమ్ కౌర్, సోనియా, నిఖిల్, వరుణ్ సందేశ్, కృష్ణుడు, ఛోటా కె. నాయుడు, ఆర్. పి. పట్నాయక్, తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీకాంత్ అడ్డాల, కె.ఎస్. రామారావు, వేణు మాధవ్ తదితరులు హాజరయ్యారు.
మరో మహిళా దర్శకురాలు
కె.ఎస్. క్రియేషన్స్, యు.ఎస్. ఆర్ మూవీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా నృత్య దర్శకురాలు బి. సుజి దర్శకురాలిగా పరిచయమవుతోంది.
సున్నిత కథాంశంతో వినోదాత్మకంగా సాగే కథలో మంచి సందేశాన్ని మేళవిస్తూ రూపొందించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సుజి తెలిపారు. ఈ చిత్రానికి రచన.. ఇక్కుర్తి నరసింహరావు, సంగీతం... నరేష్, కెమేరా... కె. జగదీష్, నిర్మాతలు... పి. వెంకటేశ్వరరావు, కె. లక్ష్మణ్.