1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలె!" పాటల విడుదల

వినోదం వెండితెర కథనాలు నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలె పాటల విడుదల సంతోష్ పవన్ మౌనిక వైశాలి ఎం జానకిరామ్ రెడ్డి
WD

సంతోష్ పవన్, మౌనిక, వైశాలి హీరోహీరోయిన్లుగా డ్రీమ్ ల్యాండ్ సినిమా పతాకంపై రూపొందుతోన్న చిత్రం "నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలె!". ఎం. జానకిరామ్ రెడ్డి దర్శక నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ముఖ్య అతిథి నిర్మాత సి. కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించి సీనియర్ జడ్జి ఉగ్రనరసింహకు అందజేశారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ... జానకి రామ్ రెడ్డి తమ సంస్థలో కొంతకాలం పనిచేశారని, పట్టుదలగల మనిషి అని కొనియాడారు. వెంగళ్‌దాస్ సంగీత దర్శకునిగా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారని, పాటలు బాగున్నాయని కళ్యాణ్ అన్నారు. సినిమా కూడా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఉగ్రనరసింహ మాట్లాడుతూ... ఈ కథలోని పోలీస్ పాత్రపై లీగల్‌గా తనతో చర్చలు జరిపారన్నారు. ఇందులో తాను ఓ పాత్రను పోషించానని చెప్పారు.

నర్సింగ్ రావ్ మాట్లాడుతూ... చక్కని సాహిత్యానికి సంగీతం తోడైందని, మెలోడి, మాస్, వెస్ట్రన్ తరహాలో పాటలుంటాయన్నారు. ఈ పాటలు అందరిని అలరిస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తనకు వృత్తిపరంగా తృప్తినిచ్చిన చిత్రమిదని, సినిమాటోగ్రాఫర్ కె. శివరాం రెడ్డి తెలిపారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ... యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో చిత్రం శ్రీను, సత్యం రాజేష్, గౌతం రాజు, జూ. రేలంగి, బండజ్యోతి, ప్రేమ్ కుమార్, కలీమ్, వరుణ్, మధు తదితరులు నటించారు. ఎడిటింగ్... రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం.. ఎం. జానకిరామ్ రెడ్డి.
About Writer
SELVI.M