"మొండి మొగుళ్లు పెంకి పెళ్ళాలు" ఆడియో విడుదల
రఘుబాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, గీతాసింగ్, రాఖీ, శీతల్ కాంబినేషన్‌లో "మొండి మొగుళ్లు పెంకి పెళ్ళాలు" చిత్రం రూపొందుతోంది. కె.వి. రమణ దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించి నెల్లూరు ఎం.ఎల్.ఎ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ... దర్శకుడు పాటలను చక్కగా తెరకెక్కించారని, నిర్మాత అభిరుచి చాలా బాగుందన్నారు. గీతాసింగ్ గ్రేసీసింగ్‌లా బాగా డాన్స్ చేసిందని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఇటువంటి చిత్రాలు విజయవంతం కావాలని సి. కళ్యాణ్ అభిలాషించారు.
ఎం.ఎల్.ఎ. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... సినిమాలు సమాజానికి మేలు చేసే అవకాశాలున్నాయని, ఆ దిశగా నెల్లూరు వాస్తవ్యులైన ఈ చిత్ర నిర్మాత మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
నిర్మాత మాట్లాడుతూ... కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సక్సెస్ అయితే మరిన్ని చిత్రాలు తీస్తానని ఆయన అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... చిన్న తనం నుంచి సినిమా తీయాలనే కోరికతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించి నిర్మాత తొలి చిత్రాన్ని తీశాడని, తల్లిదండ్రుల్ని గౌరవించడం, పిల్లల పెంపకం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. సిద్దూ చక్కని సంగీతం సమకూర్చానని చెప్పారు.
ఇంకా రఘుబాబు, శివాజీరాజా, గీతా సింగ్, రాఖీ మాట్లాడుతూ... చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.