బాలీవుడ్ అగ్రనటి బిపాసా బసు... నెయిల్ అనే యంగ్ హీరోతో జతకట్టనుంది. "ఫ్రీజ్" అనే ఈ కొత్త చిత్రానికి జహంగీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా వివరాలను ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ విక్రమ్ రజనీ తెలియజేస్తూ... తమ కొత్త చిత్రం పేరు "ఫ్రీజ్" కాదని తేల్చి చెప్పారు.
ఈ సినిమాకు "ఆ దేఖేన్ జారా" అనే పేరును ఎప్పుడో ఖరారు చేశామని విక్రమ్ అన్నారు. "ఫ్రీజ్" అనే పేరు ప్రజల్లోకి ఎలా ప్రచారమైందనే విషయం ఇంకా అర్థం కావడం లేదని తెలిపారు. ఈ చిత్రానికి "ఆ దేఖేన్ జారా" అనే పేరును ఇప్పటికే రిజిస్టర్ చేశామని విక్రమ్ తెలిపారు.
రొమాంటిక్, థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నెయిల్-బిపాసా అద్భుతమైన నటనను వెలిబుచ్చారని విక్రమ్ రజనీ చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే ఏడాదికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.