మాటలు రావటంలేదు -బాలీవుడ్ బాద్‌షా
ముంబై దాడుల ఘటనపై మాట్లాడటానికి మాటలు రావటం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు. కింగ్‌ఖాన్ ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులపై తానేమీ మాట్లాడలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
యువకులు ఇస్లాం మతాన్ని అర్థం చేసుకోవాలని, అందులోవున్న సారాంశాన్ని ఆకళింపు చేసుకోవాలని ఆయన హితబోధ చేశారు. హింస, దురాక్రమణలు చేయమని ఏ ధర్మంలోను లేదని శాంత చిత్తంతోనే ఏపనైనా సాధించగలమని పేర్కొన్నారు.
మన పిల్లలు ఏ ధర్మంలోనైనా పుట్టనీగాక తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది వారిని క్రమశిక్షణలో పెంచడమే మన ప్రథమ కర్తవ్యం అని ఉద్భోధించారు. ఏధర్మంలో కూడా ఎలాంటి ఎజెండాలు ఉండకూడదన్నది తన అభిప్రాయమని బాలీవుడ్ బాద్‌షా అన్నారు.