ఆసియా ఖండపు ''సెక్సీయెస్ట్ ఉమెన్'' కైఫ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ, పొడవుకాళ్ళ సుందరి కత్రినా కైఫ్ మరో కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆసియా ఖండంలోని మహిళల్లో అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా ఆమె నిలిచింది. గతంలో ఈ కిరీటం చేజిక్కించుకున్న మరో బాలీవుడ్ నటి బిపాసా బసును తోసిరాజని ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వారపత్రిక ‘ఈస్టర్న్ ఐ’ ప్రతి యేడాది ఆయా ఖండాల్లో ఉన్న సెక్సీయెస్ట్ మహిళలపై ఒక సర్వే నిర్విహించి, ఫలితాలను వెల్లడిస్తుంది. ఇందులోభాగంగా ఈ ఏడాది శృంగార మహిళల జాబితాను ప్రకటించగా, అందులో కత్రినా కైఫ్‌కు తొలిస్థానం దక్కింది.
ఈ సర్వే తుది ఫలితాల్లో పాల్గొన్న న్యాయ నిర్ణేతలందరూ.. కత్రినా కైఫ్‌కు ఏకగ్రీవంగా ‘అందాల పట్టం’ కట్టడం గమనార్హం. ఇదే జాబితాలో హిందీ నటి కరీనా కపూర్ మూడో స్థానంలో నిలువగా, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యారాయ్‌కు ఏడో స్థానం దక్కింది.
కొత్తగా ‘సెక్సీయెస్ట్ ఉమెన్’ జాబితాలో చేరిన వారిలో పాక్ నటి మెహ్విష్ హయత్ (9వ స్థానం), మిస్ ఇండియా యూనివర్స్ సిమ్రన్ కౌర్ (10), మాజీ మిస్ శ్రీలంక జాక్వలిన్ ఫెర్నాండెజ్ (12) తదితరులు ఉన్నారు.
ఇదిలావుండగా, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తన అందచందాలతో ఆలరిస్తున్న అసిన్‌కు కూడా ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కడం ఈ యేడాది ప్రత్యేకత. ఈ జాబితాలో అసిన్ 22వ స్థానంలో ఉన్నారు.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వారపత్రిక ‘ఈస్టర్న్ ఐ’ ప్రతి యేడాది ఆయా ఖండాల్లో ఉన్న సెక్సీయెస్ట్ మహిళలపై ఒక సర్వే నిర్విహించి, ఫలితాలను వెల్లడిస్తుంది. ఇందులోభాగంగా ఈ ఏడాది శృంగార మహిళల జాబితాను ప్రకటించగా, అందులో కత్రినా కైఫ్‌కు తొలిస్థానం దక్కింది.
|