అదనాన్ సామీ ప్రాణానికి ముప్పు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అదనాన్ సామీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే అదనాన్ గత 10 సంవత్సరాలుగా భారత్‌లోని ముంబైనే తన నివాసంగా ఏర్పరచుకుని బాలీవుడ్ సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
గత నెల 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడుల తర్వాత ఆయనకు ముంబై వదిలి వెళ్ళిపోవాలని లేకుంటే చంపేస్తామని ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా బెదిరించాడు. మొదట్లో అతను పెద్దగా పట్టించుకోలేదు. కాని రానురాను బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువైన్నట్లు అదనాన్ మిత్రులు తెలిపారు.
మొదట్లో అతను పోలీసుల ద్వారా రక్షణ తీసుకోవాలనుకున్నారు. కానీ తను ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడని అతని మిత్రుడొకరు పేర్కొన్నారు. ఈ విషయం గురించి అదనాన్ సామీని వివరణ కోరగా... నేనైతే ఏ తప్పు చేయలేదు. కాని నన్ను ఎందుకిలా భయపెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదని ఆయన పేర్కొన్నారు.
అదనాన్ సామీ ఆగష్టు 15 ,1973. బ్రిటన్‌లో పుట్టాడు. తన 7వ ఏటనుండే పియానో వాయించడం ప్రారంభించాడు. 9 ఏళ్ల ప్రాయంలోనే బిబిసిచే సంగీతంలో బాల ఉద్ధండుడిగా గుర్తింపు పొందాడు. స్వీడన్ రేడియో, టెలివిజన్ ప్రసార సంస్థ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కీ బోర్డ్ ప్లేయర్‌గా అదనాన్ సామీని గుర్తించింది.
అదనాన్ 10 సంవత్సరాల వయస్సులో లండన్‌లో జరిగిన ఆర్.డి. బర్మన్ సంగీత విభావరిలో తన గానామృతంతో సంగీత ప్రియులను మంత్ర ముగ్దులను చేశారు. ఈ కార్కక్రమంలో పాల్గొన్న ఆశాభోంస్లే తనను సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించారని ఆయన వెల్లడించారు.
పియానో వాయించడంలో దిట్ట అయిన అదనాన్ సామీ స్వీడన్, జోర్డన్ దేశ రాజులను సైతం తన గానామృతంతో ఓలలాడించాడు. అవార్డులకైతే కొదవే లేదు. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ 2002లోఉత్తమ నటుడిగా సన్మానించింది. ఇదేసంస్థ 2003లో ఉత్తమ గాయకుడిగా అవార్డును ప్రదానం చేసింది.
ఇంకా ఇతను తయారుచేసిన ఆల్బమ్‌లలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అమీషా పటేల్, రాణీ ముఖర్జీ, భూమిక, మహిమా చౌదరి లాంటి హేమా హేమీలు నటించారు.