1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో "నిండు మనసులు"

వినోదం వెండితెర కథనాలు మీరాజాస్మిన్ ప్రధాన పాత్ర నిండు మనసులు కస్తూరిమాన్ మలయాళ చిత్రం
WD
మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో లోహితదాస్ దర్శకత్వం వహించిన "కస్తూరిమాన్" అనే మలయాళ చిత్రం ఘనవిజయం సాధించి శతదినోత్సవం వేడుకలను వైభవంగా జరుపుకుంది. ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరించిన ఈ సినిమాకు మీరాజాస్మిన్ నటన హైలైట్‌గా నిలిచింది.

ఇదే చిత్రాన్ని తెలుగులో పవర్ మూవీస్ పతాకంపై నిర్మాత వై. శ్రీరామ్ "నిండు మనసులు" పేరుతో తెరకెక్కించనున్నారు. ఈ నెల 12వ తేదీన (శుక్రవారం) విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత, మాటల రచయిత శ్రీరామ్ మాట్లాడుతూ... పెద్ద బంగళా, బెంజికారు ఉన్న ఒక జమిందారీ కుటుంబం వారి ఆస్తికి మించిన అప్పులతో సతమతమవుతూ ఉంటారని చెప్పారు.

పగలంతా అప్పులవారికి సమాధానం చెప్తూ, రాత్రి కాగానే మరుసటి రోజు ఎవరి దగ్గర ఎలా అప్పు చేయాలని ఆలోచించే ఆ కుటుంబంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా హీరో కన్పిస్తాడని, అతను ఐఏఎస్ చదవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతని ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించకపోవడంతో కాలేజీలో చదువుకుంటునే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని నిర్మాత వెల్లడించారు.

మరోవైపు... తన స్నేహితులతో కలిసి హీరోను టీజ్ చేయడానికి హీరోయిన్ అనేక సార్లు ప్రయత్నిస్తుంది. అప్పటి వరకు హీరోను శ్రీమంతుల అబ్బాయిగా హీరోయిన్ భావిస్తుంది. ఆ తర్వాత అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకుని చాలా బాధపడి, అతన్ని ఎలాగయినా ఐఏఎస్ ఆఫీసర్‌ని చెయ్యాలనుకుంటుందని శ్రీరామ్ చెప్పారు.

అందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని మీరా జాస్మిన్ హీరోకు అందిస్తూ ఉంటుందని, ఇదంతా తెలిసిన హీరో కుటుంబం ఆ అమ్మాయి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అనుకుంటారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. హీరోయిన్ హీరోకు ఆర్థికసాయం ఎలా అందించగలిగింది... అనేది ఈ కథలో ప్రధానాంశమని నిర్మాత వివరించారు.

వారిద్దరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి.? వాటిని ఎలా పరిష్కరించి ఇద్దరూ ఒక్కటయ్యారనేది డైరక్టర్ లోహిత దాస్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. చక్కని కథ, కథనాలతో ఆద్యంతం చక్కని ఫీల్ కలిగించే చిత్రంగా "నిండు మనసులు" అందరినీ అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మీరాజాస్మిన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో జయసూర్య, కొచ్చిన్ హనీఫా, పునీత్ తిలకన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పాటలు... వెలిదండ్ల, సంగీతం.. రాజభాస్కర్, ఎడిటింగ్... సి. మణి. మాటలు, నిర్మాత... శ్రీరామ్ వై. సినిమాటోగ్రఫీ, దర్శకత్వం... లోహితదాస్.
About Writer
SELVI.M