గోపిచంద్, కాజల్ జంటగా కొత్త చిత్రం
|
వరుస విజయాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న గోపిచంద్ కథానాయకుడిగా, "శౌర్యం" వంటి సూపర్ హిట్‌ను అందించి "ది బెస్ట్" డైరక్టర్‌గా అభినందనలు పొందిన "శివ" దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది.
"జంబలకిడిపంబ" చిత్రం నుంచి వరుసగా అందరూ మెచ్చిన "మా విడాకులు", "సముద్రం", "మనసున్నమారాజు", "సీమ సింహం" వంటి సూపర్ హిట్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించి ఉత్తమ నిర్మాతలుగా అందరి అభినందనలు అందుకుంటున్న సోదరులు జె భగవాన్, జె. పుల్లారావులు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాత భగవాన్ వెల్లడిస్తూ... హీరోగా గోపిచంద్‌కి ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మాస్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్ కథాంశాన్ని శివ దర్శకత్వంలో అద్భుతంగా తెరకెక్కించనున్నామని చెప్పారు.
ఇందులో గోపిచంద్‌కి జతగా గ్లామర్ గర్ల్ కాజల్‌ని ఎన్నుకోవడం జరిగిందని, ఈ చిత్రంలో హీరో గోపిచంద్ ఓ కొత్త స్టైల్‌లో కన్పించనున్నారని నిర్మాత పేర్కొన్నారు.
మరో నిర్మాత పుల్లారావు మాట్లాడుతూ... కొత్త సంవత్సరం జనవరి ప్రారంభంలో పాటల రికార్డింగ్‌ని జరిపి, జనవరి మూడో వారంలో షూటింగ్ ముహూర్తాన్ని ఖరారు చేశామన్నారు.