20 నుంచి "కరెంట్" రెండో షెడ్యూల్ ప్రారంభం
|
ఈ సినిమా రెండో షెడ్యూల్... ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పూర్తయిన మొదటి షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు సుశాంత్, స్నేహఉల్లాల్‌లపై కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. కరెంట్ సబ్జెక్ట్ ప్రేక్షకులను అలరిస్తుందని, ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సూర్యప్రతాప్ టేకింగ్ అద్భుతంగా ఉంటుందని చిత్రయూనిట్ వెల్లడించింది.
దేవీశ్రీప్రసాద్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి, విజయ్ సి. కుమార్ ఫోటోగ్రఫీ అందించారు. ఇంకా చెప్పాలంటే... "కరెంట్" చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీలో టాక్. తప్పకుండా 2009లో "కరెంట్" ఓ సూపర్ హిట్ సినిమా అవుతుందన్న నమ్మకం సినీ యూనిట్‌లోని ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.
ఇకపోతే... బయ్యర్స్‌లో కూడా స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న "కరెంట్" సినిమా సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమౌతుండగా, జనవరిలో జరుగబోయే షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తుంది.