"భార్గవి"ని చంపింది.. ప్రవీణ్ కుమారేనా...!?
"అష్టా చమ్మా" సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన "భార్గవి" అనుమానస్పద మరణం హత్యేనని తెలుస్తోంది. కథానాయిక భార్గవిది ఆత్మహత్య కాదని, ఆమెను వివాహం చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్న ప్రవీణ్ కుమారే ఆమెను చంపి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
భార్గవి శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో ఆమెది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భార్గవి ఆత్మహత్యకు ఉపయోగించిన విషం సీసా, హత్యకు ఉపయోగించిన ఆయుధం, కూల్ డ్రింక్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో ముఖ్యంగా.... ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. భార్గవి, తను గతంలో ఆటా ఉత్సవాల్లో కలిసి పాల్గొన్నామని, సినిమాల్లోకి రంగప్రవేశం చేశాక తనను ఏ మాత్రం పట్టించుకోక, నిర్లక్ష్యం చేస్తుండటంతో భార్గవిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2006లో ఇద్దరం వివాహం చేసుకున్నామని, ఏడాదిగా వేరువేరుగా ఉంటున్నామని, అష్టా చమ్మా విజయం సాధించడంతో తనను ఏమాత్రం పట్టించుకోక పక్కన పెట్టిందని ప్రవీణ్ కుమార్ ఆ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ లేఖను బట్టి పోలీసులు భార్గవిది హత్యేనని భావిస్తున్నారు. అదనపు వివరాల కోసం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.