"ఫిట్టింగ్ మాస్టర్" ఆడియో ఆవిష్కరణ
ఇ.వి.వి. సినిమా పతాకంపై "అల్లరి నరేష్" కథానాయకుడిగా రూపొందుతోన్న "ఫిట్టింగ్ మాస్టర్" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. డి. రామానాయుడు ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి, అంబికా కృష్ణకు అందజేశారు. అదేవిధంగా ఆడియో సీడీని మాగంటి బాబు ఆవిష్కరించి, డా. కె.ఎల్ నారాయణకు అందజేశారు.
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... ఇ.వి.వి సత్యనారాయణ తన కుటుంబ సభ్యుడులాంటి వాడని, నరేష్ చిన్న నిర్మాతల కథానాయకుడిగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. పెద్ద బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని రామానాయుడు ఆకాంక్షించారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం అగ్రహీరోలు చిత్రాలు చేయకపోవడంతో ఎంతో మంది కార్మికులకు ఉపాధి అవకాశం లభించడం లేదని, ఈ ఏడాది చిన్న చిత్రాలు ఎక్కువయ్యాయని, అందులో నరేష్ చిత్రాలే ఎక్కువ విజయవంతం అవుతున్నాయని చెప్పారు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని సాధించాలని అంబికా కృష్ణ అభిలాషించారు.
హీరో ఉదయ్ కిరణ్... ఇ.వి.వి. తన ఫేవరేట్ దర్శకుడని, ఆయన వారసుడైన నరేష్ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకున్నాడని, కమిట్‌మెంట్ ఉన్న నటునిగా పేరుతెచ్చుకున్న నరేష్‌కు ఫిట్టింగ్ మాస్టర్ హిట్టింగ్ మాస్టర్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇ.వి.వి మాట్లాడుతూ.. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించానన్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానం మారిందని, దానికనుగుణంగా కథను తీర్చిదిద్దానని పేర్కొన్నారు. దీనికోసం 18 వర్షన్‌లు చూశానని, ఈ చిత్రాన్ని ప్రతి ఇంట్లో జరుగుతున్న ఓ సమస్యను ప్రధానంగా తీసుకుని చిత్రీకరించానని వెల్లడించారు.
నరేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు ఈ సినిమాలో ఐదు ఫైట్లున్నాయని ఇ.వి.వి అన్నారు. ఇకపోతే.. 125 చిత్రాలకు రీరికార్డింగ్ చేసిన చిన్నా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారని వెల్లడించారు. వనమాలి ఈ చిత్రానికి పాటలు రాశారని, ఈ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందని ఇ.వి.వి ఆకాంక్షించారు.
నరేష్ మాట్లాడుతూ... తనను అందరూ మినిమమ్ గ్యారంటీ హీరో అంటున్నారని, ఈ విజయాల వెనుక తన తండ్రి కృషి ఉందని చెప్పారు. చిన్నతనంలో ఒక పెన్సిల్ పోగొట్టుకుంటే మరో పెన్సిల్ కొనిచ్చారని, ప్రస్తుతం ఒక సినిమా పోతే మరో సినిమా తీస్తున్నారని తెలిపారు. తన వల్ల ఎంతో పోగొట్టుకున్న తండ్రికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిపెడుతుందని ఆశిస్తున్నానని నరేష్ తెలిపారు.