1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

35 దేశాల్లో అమీర్ హిందీ "గజినీ" విడుదల

వినోదం వెండితెర కథనాలు గీతా ఆర్ట్స్ అమీర్ హిందీ గజినీ విడుదల 25 దేశాలు అల్లు అరవింద్ 2000 ప్రింట్లు
గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన హిందీ "గజనీ" చిత్రం ఈ నెల 25న 35 దేశాల్లో విడుదల కానుంది. 2000 ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత మధు వెల్లడించారు. భవిష్యత్‌లో గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ చిత్రాలు నిర్మిస్తామని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ అన్నారు. వంపులు తిరిగిన కండరాలతో, గుండుతో విచిత్రంగా కన్పించే అమీర్‌ఖాన్ ఎయిట్‌ప్యాక్స్‌తో అదరగొట్టారని టెండూల్కర్ కితాబివ్వడం విశేషమని ఆయన చెప్పారు.

ఇప్పటికే ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ప్రజామోదాన్ని పొందిందన్నారు. ఈ చిత్ర నిర్మాణం ద్వారా తెలుగువాడి ఫిలిం మేకింగ్ స్ఠామినాను చాటి చెప్పామని పేర్కొన్నారు. అసిన్, జియాఖాన్, ప్రదీప్‌రావత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. రవి.కె.చంద్రన్, ఫైట్స్... పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... ఎ.ఆర్. మురుగదాస్.
About Writer
SELVI.M