"సత్యం ఐపీఎస్"గా వస్తున్న పృథ్వీరాజ్
|
పృథ్వీరాజ్, ప్రియమణి జంటగా నటించిన "సత్యం" అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో "సత్యం ఐపీఎస్"గా అనువదిస్తున్నారు. 9స్టార్ ఫిలింస్ పతాకంపై ఇ.మధు అనువదిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 1వ తేదీన విడుదల చేయనున్నారు.
తన తండ్రికి పోలీస్ వ్యవస్థలో జరిగిన అన్యాయానికి కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని మధు తెలిపారు. ఫైట్స్ చాలా బాగున్నాయని, పృథ్వీరాజ్ రిస్క్ తీసుకుని చేసిన ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మధు వెల్లడించారు. జెస్సిగిఫ్ట్ మంచి సంగీతాన్ని అందించారని, ఇందులో ప్రియమణి జర్నలిస్టుగా నటించిందన్నారు.
మలయాళంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులోనూ అంతే విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని మధు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ ప్రేమ్‌చంద్ మాట్లాడుతూ... "అంకుశం" వంటి పవర్‌ఫుల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందిందన్నారు. పృథ్వీరాజ్ పోలీసు అధికారిగా అద్భుతంగా నటించారని, అన్ని ఎమోషనల్స్ చక్కగా అమరాయని ప్రేమ్‌చంద్ తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు.. పాటలు... వెన్నెలకంటి, సమర్పణ... బేబి మందుమిధిల, దర్శకత్వం.. వినయన్.