1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జనవరి 3 నుంచి "కొమరంపులి" తాజాషెడ్యూల్!

వినోదం వెండితెర కథనాలు జనవరి కొమరంపులి తాజాషెడ్యూల్ పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఖుషి ఎస్జె సూర్య నిఖిష
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా "ఖుషి" ఫేం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం "కొమరంపులి". కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత శింగనమల రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి దర్శకుడు ఎస్.జె.సూర్య చెబుతూ... జనవరి 3 నుండి ఫిబ్రవరి 15వరకు జరిగే షెడ్యూల్‌తో నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుందన్నారు. మార్చిలో పాటల చిత్రీకరణ పూర్తిచేసి సమ్మర్ స్పెషల్‌గా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య చెప్పారు.

పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో "ఖుషి" తర్వాత చేస్తున్న పవర్‌ఫుల్ మూవీ ఇదని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఆయన వెల్లడించారు. పవన్‌కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని సూర్య వివరించారు.

పవర్‌స్టార్ సరసన కొత్త హీరోయిన్ నిఖిష నటిస్తున్న ఈ చిత్రంలో, మనోజ్ వాజ్‌పేయ్, చరణ్‌రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంగీతం.. ఎ.ఆర్.రెహమాన్, ఫోటోగ్రఫీ... బినోద్ ప్రధాన్, ఫైట్స్... విజయన్, ఆర్ట్.. ఆనంద్‌సాయి, ఎడిటింగ్... కోలాభాస్కర్, ప్రొడక్షన్ కంట్రోలర్... కిషోర్, ప్రొడక్షన్, ఎగ్జిక్యూటివ్.. సత్యం, రాంబాబు, చౌదరి.
About Writer
SELVI.M