గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » దాసరి చేతులమీదుగా "మస్కా" ఆడియో ఆవిష్కరణ
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD

ఎం.ఎస్.రాజు నిర్మాతగా, బి.గోపాల్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం "మస్కా". ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ఆడియోసీడీని విడుదల చేయగా, డి. సురేష్‌బాబు క్యాసెట్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... ఈ మధ్య వస్తోన్న యువహీరోల్లో రామ్‌లో ఎనర్జీ బాగుందన్నారు. ఎం.ఎస్. రాజు మంచి టీమ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని దాసరి చెప్పారు. తాను దర్శకత్వం వహించిన ఎం.ఎల్.ఎ. ఏడుకొండలు చిత్రం 1982 సంవత్సరంలో రాజు తండ్రి నిర్మించారని, అందుకే తనకు బాగోకపోయినా బి.గోపాల్, ఎం.ఎస్ రాజు అడిగిన వెంటనే కాదనలేక ఈ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు.

ఇటువంటి చక్కని నిర్మాత ఇండస్ట్రీకి కావాలని, నిర్మాత అనేవాడు ఎంత ఇన్‌వాల్వ్ అవ్వాలో రాజును చూసి నేర్చుకోవాలని ప్రశంసించారు. ఈ చిత్రం గోపాల్‌కు మంచి సక్సెస్ కావాలని దాసరి ఆకాంక్షించారు.

హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ... ప్రొఫిషన్ నటుడిగా రామ్ బాగా నటించాడని, దేశముదురు తర్వాత చక్రి సంగీత దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రమిదన్నారు. గత రెండు చిత్రాలు చేసినదానికంటే ఎం.ఎస్.రాజు సినిమాలో చేసేటప్పుడు కంఫర్ట్‌బుల్‌గా ఫీలయ్యానని హన్సిక చెప్పారు.

చక్రి మాట్లాడుతూ.. ఇందులో ఆరు అద్భుతమైన పాటలున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాల కల ఈ సినిమా ద్వారా నెరవేరిందని చెప్పారు. ఇందులో నెల్లూరు యాసలో సాగే ఝాన్సీ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చక్రి వెల్లడించారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... కొత్త కథ, కథనం ఈ చిత్రంలో చూస్తారన్నారు. చిత్రానికి కథ స్తంభంలాంటిందని, మాస్ ఎలిమెంట్స్ ఉన్న చక్కని ప్రేమకథా చిత్రమిదని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఇక ఈ బేనర్‌లో సునీల్ అన్నీ మంచి పాత్రలే చేశాడని, ఇందులో మాత్రం సునీల్ పవర్‌ఫుల్ కామెడీ పాత్ర పోషించాడని పరుచూరి తెలిపారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ప్రేక్షకులను కామెడీతో అలరిస్తారని, ఈ చిత్రం అందరికీ విజయాన్ని చేకూరుస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో రామ్ మాట్లాడుతూ... తనకు 13ఏళ్లున్నప్పడే తాను చేసిన తొలి షార్ట్ ఫిలింను ఎం.ఎస్. రాజు చూశారని, ఆయన పతాకంపై చేయడం గౌరవంగా భావిస్తున్నానని, మస్కా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందని రామ్ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు దాసరి మస్కా ఆడియో ఆవిష్కరణ ఎంఎస్రాజు బిగోపాల్ రామ్ హన్సిక