వెండితెరపై తమ అందాలు ఆరబోస్తూ టీనేజ్ కుర్రకారును ఊరించే హీరోయిన్లు... తెరవెనుక పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బాత్‌రూమ్ సీన్లు, బీచ్‌లో బికినీలో నటనలూ, స్విమ్మింగ్‌పూల్‌లో ఈత సీన్లు వంటివాటిలో నటీమణులు చల్లని నీటిలో మునుగుతూ సహజమైన నటనను ప్రదర్శించటం చాలా కష్టమైన పనే. ఇంటీరియర్‌లో చిత్రించే బాత్రూం సన్నివేశాలు ఒకింత ఫర్వాలేదు గానీ... బీచ్‌ల ఒడ్డున, పెద్ద పెద్ద గార్డెన్లలోని స్విమ్మింగ్‌పూల్ సన్నివేశాలను రూపొందించే సమయంలో... హీరోయిన్లకు ఎన్నో కష్టాలెదురవుతుంటాయట.
ఆ మధ్య నమిత... తమిళనాడు బీచ్ ఒడ్డున బీచ్ డ్రెస్సులో ఓ సన్నివేశంలో నటిస్తుంటే... ఆమె అందాలకు మతిపోయిన అక్కడి కుర్రకారు ఆమెపై ఎగబడ్డారట. నానా హంగామా చేశారని సమాచారం. చివరికెలాగో ప్రేక్షక 'రాక్షస' అభిమానం నుంచి తప్పుకుని బయటపడిందట నమిత.
ఇక మన టాలీవుడ్ హీరోయిన్లలో కొందరు బాత్‌టబ్ స్నాన ఘట్టాలలో అప్పుడప్పుడూ కనిపిస్తూ టీనేజ్ కుర్రకారును వెర్రిత్తిస్తున్నారు. ఇటువంటి తారమణుల్లో ఇప్పుడు అంకిత కూడా చేరిపోయింది. అయితే బాత్‌టబ్ సీన్లలో నటించటపుడు చల్లటి నీటిలో ఉండి సహజమైన నటనను ప్రదర్శించటం చాలా ఇబ్బంది అంటారు. అయినా ప్రేక్షకులకోసం... చేస్తామంటారు ఈ డ్రీమ్ గాళ్స్.