1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జనవరి 23న "వరుణ్ సందేశ్" కొత్త చిత్రం ప్రారంభం!

వినోదం వెండితెర కథనాలు జనవరి 23న వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ప్రారంభం హ్యాపీడేస్ కొత్తబంగారులోకం సందీప్ గుణ్ణం పి కిరణ్
"హ్యాపీడేస్", "కొత్తబంగారులోకం" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ కథానాయకుడిగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

హిట్ చిత్రాల సంస్థ ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జనవరి 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ధనుష్ చిత్రం "పొల్లాదవన్" ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.

హీరో వరుణ్ సందేశ్‌కు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని నిర్మాత కిరణ్ అన్నారు. విభిన్న కథాంశంతో, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నామని ఆయన వెల్లడించారు.
About Writer
SELVI.M