గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » నవదీప్, భూమిక, కిమ్‌శర్మల "యాగం"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
నవదీప్, భూమిక, కిమ్‌శర్మ (ఖడ్గం ఫేమ్) హీరోహీరోయిన్లుగా పి.ఎ. అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "యాగం" అనే పేరును ఖరారు చేసినట్లు నిర్మాతలు రాజు, ప్రవీణ్ వెల్లడించారు.

జనవరిలో ఓ గీతాన్ని నవదీప్, భూమికలపై చిత్రించడంతో ఈ చిత్ర నిర్మాణం పూర్తవుతుందని, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్స్ దశలో ఉందని వారు తెలిపారు. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు.
FILE

చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ... నవదీప్‌కున్న ప్రేమకథా చిత్రాల ఇమేజ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్‌ను సంపాదించిపెట్టే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందన్నారు. నవదీప్ బ్యాంకాక్‌లోని రూరల్ ఏరియాలో ఓ బారులో పనిచేస్తుంటాడని, కిమ్‌శర్మ కూడా అక్కడే పనిచేస్తుంటుందని, భూమిక్ ఎయిర్‌హోస్టెస్‌గా ఈ సినిమాలో కన్పిస్తుందని దర్శకుడు తెలిపారు.

ఈ ముగ్గురి చుట్టే కథ నడుస్తుందని, ఇండియా, బ్యాంకాక్‌లలో జరిగే యాక్షన్ సన్నివేశాల సమ్మేళనం ఈ "యాగం" అని దర్శకుడు వివరించారు. పాటలకు పరిమితమై అందంగా కనబడే బ్యాంకాక్ ప్రాంతాన్ని ఈ చిత్రంలో కొత్తకోణంలో చూడబోతున్నారని ఆయన వెల్లడించారు.

భూమిక పాత్ర కీలకమైందని, హిందూ పురోహితునిగా అలీ కన్పిస్తారని దర్శకుడు చెప్పారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. పి.ఎ. అరుణ్‌ప్రసాద్, సమర్పణ... భరత్ ఠాకూర్, నిర్మాణం... సిల్వర్ స్క్రీన్ మూవీస్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు నవదీప్ భూమిక కిమ్శర్మల యాగం అరుణ్ప్రసాద్ రాజు ప్రవీణ్