1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

విదేశాలకు వెళ్తున్న "అ... ఆ...ఇ...ఈ..."

వినోదం వెండితెర కథనాలు విదేశాలు అ ఆఇఈ శ్రీకాంత్ మీరాజాస్మిన్ సదా కాంబినేషన్ శ్రీనివాసరెడ్డి బొద్దం అశోక్యాదవ్
WD

శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "అ... ఆ...ఇ...ఈ..." (అతను...ఆమె...ఇంతలో..ఈమె). శ్రీ కల్పనా ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్‌యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్, ఫైట్స్ పూర్తి చేసుకుంది. జనవరిలో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు.

ఫిబ్రవరి ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సారథి ఎ. శేఖర్ తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, హాయిగా నవ్వించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. "యమగోల మళ్లీ మొదలైంది" కాంబినేషన్‌ తర్వాత మళ్లీ కలిసి చేస్తున్న ఈ చిత్రం... తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాత అశోక్‌యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రంలో కృష్ణభగవాన్, సూర్య, బ్రహ్మానందం, అలీ. ఏవీఎస్, సునీల్, ఎం.ఎస్. నారాయణ, తెలంగాణా శకుంతల, వైజాగ్ ప్రసాద్, కవిత, కిన్నెర, కోవైసరళ, రమ్యశ్రీ తదితరులు నటిస్తున్నారు.
About Writer
SELVI.M