1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే "ద్రోణ"

వినోదం వెండితెర కథనాలు తండ్రీకొడుకులు అనుబంధం ద్రోణ నితిన్ ప్రియమణి  కరుణకుమార్ సాయికృష్ణ ప్రొడక్షన్స్ డిఎస్ రావు
నితిన్, ప్రియమణి జంటగా, కరుణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలో యాక్షన్ హీరోగా నితిన్ మరో కొత్త కోణంలో కన్పించగా, ప్రియమణి తన గ్లామర్‌తో ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్ర ఆడియో త్వరలో సుప్రీం ద్వారా విడుదల కానుంది.
About Writer
SELVI.M