1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"మస్త్" ఆడియో ప్రీమియర్ విడుదల

వినోదం వెండితెర కథనాలు మస్త్ ఆడియో ప్రీమియర్ విడుదల శివాజీ శివబాలాజీ అర్చన ముఖుల్ దేవ్ డా బ్రహ్మానందం అలీ
WD

జీ మోహన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న తెలుగు చిత్రం "మస్త్". శివాజీ, శివబాలాజీ, అర్చన, ముఖుల్ దేవ్, డా. బ్రహ్మానందం, అలీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ చిత్రంలోని పాటలను సరిగమ మ్యూజిక్ కంపెనీ ద్వారా త్వరలో విడుదల చేయనున్నారు.

ముందుగా ఈ పాటల ప్రీమియర్‌ను రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రహీరో శివాజీ, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి హాజరయ్యారు. తొలిసారిగా ఆడియో ప్రీమియర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కొత్తదనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీ-ఎ.పి హెడ్ సంజయ్ రెడ్డి, శివానంద తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M