1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఆకాష్" హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్‌పై కొత్త చిత్రం

వినోదం వెండితెర కథనాలు ఆకాష్ హీరో లైఫ్టైమ్ పిక్చర్స్ కొత్త చిత్రం కుంచాల వెంకటేశ్వర్లు నిర్ణయ్ పల్లాటి యు అండ్ ఐ భూకైలాస్ సీక్వెల్ అరకు యు అండ్ ఐ
ఆకాష్ హీరోగా లైఫ్‌టైమ్ పిక్చర్స్ అనే నూతన నిర్మాణ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. కుంచాల వెంకటేశ్వర్లు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పలువురు దర్శకుల వద్ద పనిచేసిన నిర్ణయ్ పల్లాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను త్వరలో పూర్తిచేసి ఈ నెలాఖరులో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెంకటేశ్వర్లు తెలియజేశారు. రత్నం, శైలుకుమార్, సుధాకర్ సహనిర్మాతలుగా వ్యవహరించే ఈ చిత్రానికి ఛాయాగ్రహణం... జాన్, కూర్పు... నందమూరి హరి, కోడైరక్టర్.. శ్రీనివాస్ కోనేటి.

అరకులో "యు అండ్ ఐ"
రోషన్, అదిత్ చౌదరి నూతన జంటగా యశోదరదేవి సమర్పణలో జె.ఎస్.ఎం.ఎన్ సినిమా పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం "యు అండ్ ఐ". ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటి (జనవరి 2) నుంచి 11 వరకు అరకు తదితర ప్రాంతాల్లో పాటలు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం.. కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... ఎ.పి.స్వామి, నిర్మాత... రవిందర్ తోట.

భూకైలాస్‌కు సీక్వెల్?
సీక్వెల్ తరహా చిత్రాలు వస్తున్న తరుణంలో వేణుమాధవ్ హీరోగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో గురునాధరెడ్డి నిర్మించిన "భూకైలాస్" చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. ఇందులో నటించిన వేణుమాధవ్, ముమైత్ మళ్లీ ఇందులో నటించనున్నట్లు సమాచారం. భూకైలాస్‌లో రియల్ ఎస్టేట్ గురుంచి చర్చిస్తే.. సీక్వెల్‌లో ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి చర్చించనున్నట్లు తెలిసింది.
About Writer
SELVI.M