1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చక్రి చాలా మంచోడు: శ్రీనువైట్ల

వినోదం వెండితెర కథనాలు చక్రి చాలా మంచోడు శ్రీనువైట్ల  కింగ్ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల గోపీమోహన్ దానయ్య నాగార్జున కింగ్
WD

సంగీదర్శకుడు చక్రి చాలా మంచోడని "కింగ్" చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. "ఢీ" చిత్రానికి చక్రి చాలా సహకరించాడని, తాజాగా విడుదలైన నాగార్జున "కింగ్" చిత్రంలో చూపించిన సంగీతదర్శకుడు పాత్రకు చక్రికి ఏ మాత్రం పొంతనలేదని శ్రీనువైట్ల వివరణ ఇచ్చారు.

"కింగ్" చిత్రంలో ఇళయరాజా ట్యూన్స్ కాపీకొట్టేసి తన ట్యూన్స్‌గా చెప్పుకునే సంగీత దర్శకుడి పాత్రలో బ్రహ్మానందం నటించారు. తనకు సహకరించనిదే కొత్త గాయనీమణులను ఇతడు ప్రోత్సహించడు. ఆ పాత్రకు కొంతమంది అభిమానులుండటం.. వారు రక్తదానాలు చేస్తుండటం.. ఇవన్నీ చక్రి నిజజీవితానికి దగ్గరగా ఉన్నాయని తలచి కొన్ని వెబ్‌సైట్లు, ప్రింట్ మీడియాలు ఆ పాత్ర చక్రినుద్దేశించి తీసినదేనని రివ్యూలలో పొందుపరిచారు.

ఇది తెలిసిన చక్రి మనోవేదనకు గురై గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ముందు వ్యక్తం చేయడంతో... ఈ విషయం తెలిసిన దర్శకుడు శ్రీనువైట్ల శుక్రవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

"కింగ్‌"లో సంగీత దర్శకుడి పాత్రకు చక్రికి సంబంధమే లేదని, ఆ పాత్రను తాను సృష్టించలేదని, రచయితలు గోపీ మోహన్ క్రియేట్ చేసిన పాత్ర అదని శ్రీనువైట్ల పేర్కొన్నారు. ఆ పాత్ర చేయిస్తున్నప్పుడు తన దృష్టిలో చక్రిలేనేలేడని, ఏవేవో ఊహించుకుని ఇటువంటి వార్తలు రాయకండని శ్రీనువైట్ల మీడియాకు సూచించారు. త్వరలో తాను చక్రి కలిసి ఓ చిత్రానికి పనిచేస్తామని వెల్లడించారు.

ఆదరణ అనూహ్యం..
నాగార్జున "కింగ్" చిత్రానికి అనూహ్య ఆదరణ లభిస్తోందని శ్రీనువైట్ల వెల్లడించారు. నాగ్ చాలా సంతోషంగా ఉన్నారని, ఆయన కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చాయన్నారు. వివిధ జిల్లాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని, వారికి మంచి లాభాలు వస్తున్నాయని శ్రీనువైట్ల తెలిపారు. ఇండస్ట్రీ కూడా ఈ చిత్రాన్ని చూసి అభినందించిందని ఆయన తెలిపారు.

ఏవో పేర్లు పెట్టాలని పెట్టాం...
ఈ చిత్రంలో గోపీమోహన్, దానయ్య పేర్లు ఏవో పేర్లు పెట్టాలని పెట్టినవేగానీ ఎవరినీ ఉద్దేశించినవి కావని శ్రీనువైట్ల చెప్పారు. నిర్మాత దానయ్య పేరును వాడుకోలేదని... అలా అనుకుంటే గతంలో "రెడీ" తీసిన స్రవంతి రవికిషోర్ పేరు పెట్టేవాడిని కదా అని చెప్పారు.

చంద్రముఖి అంటే ఇష్టం...
తనకు చంద్రముఖి చిత్రమంటే చాలా ఇష్టమని, అందుకే చనిపోయిన "కింగ్" బతికివున్న బొట్టుశ్రీను పాత్రలో ప్రవేశించడం అనేది కాన్సెప్ట్ కావాలనే పెట్టానని శ్రీనువైట్ల చెప్పారు. కథాగమనంలో వైవిధ్యంకోసమే అలా చేశానని ఆయన వివరించారు.

టీవీ షోస్ నా క్రియేషన్...
పలు టీవీ కార్యక్రమాల్లో జడ్జిలుగా చాలామంది సంగీత దర్శకులు హాజరు కావడం చూశానని, అందులో చిన్నపిల్లలు చాలా చక్కగా పాడుతుంటారని, కానీ కొంతమంది జడ్జీలు వారిని రకరకాలుగా ఏడిపిస్తుంటడం గమనించానని శ్రీనువైట్ల అన్నారు. అందుకే తన ఆలోచనకు "కింగ్" చిత్రం ద్వారా రూపమిచ్చానని ఆయన వెల్లడించారు.

కలెక్షన్లు సూపర్: చందన
ప్రతి సెంటర్లలోనూ కలెక్షన్లు బాగున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 కోట్ల షేర్ వచ్చిందని, నెల్లూరు, విజయవాడ సెంటర్లలో ఇప్పటికీ కింగ్ హౌస్‌ఫుల్‌గా చిత్ర సమర్పకుడు చందన్ నడుస్తోందన్నారు. పైరసీ నివారణకు నాగార్జున ఫ్యాన్స్‌కూడా సహకరించడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.
About Writer
SELVI.M