"మహానగరంలో" చిత్రానికి పాటలే హైలైట్‌గా నిలిచాయని చిత్ర దర్శక నిర్మాతలు జి.ఎల్.బి. శ్రీనివాస్, ఓం నమశ్శివాయ తెలిపారు. యశ్వంత్, విజయభాస్కర్ తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి ఒకటోతేదీన విడుదలై అందరి ప్రశంసలను అందుకుంటుందని వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. బతుకు తెరువుకోసం సిటీకి వచ్చిన యువత ఎదుర్కొన్న కొన్ని సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించామన్నారు. విడుదలైన అన్నిచోట్ల నుంచి పాజిటివ్ స్పందన వచ్చిందని వారు చెప్పారు. కోటి స్వరాలకు చంద్రబోస్ రాసిన హోలీపాట చిత్రానికి హైలైట్‌గా నిలిచిందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.
తొలి చిత్రానికే అన్నిచోట్ల మంచి స్పందన రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. త్వరలో మరో సినిమాను తీయనున్నట్లు ఆయన తెలిపారు.
హీరో యశ్వంత్ మాట్లాడుతూ... సంవత్సరం ప్రారంభంలోనే సినిమా విడుదల కావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యానని, చూసినవారంతా బాగుందనడంతో తనలో ధైర్యం నింపినట్లయిందని చెప్పారు.
విజయభాస్కర్ మాట్లాడుతూ... చక్కటి పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయని, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిలాల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.