1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రీరికార్డింగ్‌లో "మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు"

వినోదం వెండితెర కథనాలు రీరికార్డింగ్ మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు రఘుబాబు శివాజీరాజా యనమల బాబిరెడ్డి కెవిరమణ
రఘుబాబు, శివాజీరాజా హీరోలుగా కుమారి యనమల హర్షిణిరెడ్డి సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు". మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె.వి.రమణ దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ కార్యక్రమం జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత యనమల బాబిరెడ్డి మాట్లాడుతూ.. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, జనవరి నెలాఖరులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నామని నిర్మాత అన్నారు.

దర్శకుడు కె.వి.రమణ మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతిప్రేక్షకుడు తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ కథ రూపొందిందని రమణ వెల్లడించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరికీ మంచిపేరు సంపాదించిపెడుతుందని రమణ ఆకాంక్షించారు.

రఘుబాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, జీవా, బాబూమోహన్, కళ్ళు చిదంబరం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ... కళ్యాణ్ సమి, ఎడిటింగ్.... మోహన్ రామారావు, సంగీతం... సిద్ధు.
About Writer
SELVI.M