1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హీరో "రాజా" సమర్థుడేనా...?

వినోదం వెండితెర కథనాలు హీరో రాజా సమర్థుడు నీతి ఆనంద్ మేకప్ వ్యాన్స్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సంజన
"హీరో "రాజా" సమర్థుడేనా!" అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొంది. ఎన్నో చిత్రాల్లో నటించినా "ఆనంద్" చిత్రానికి ధీటుగా రాజాకు చెప్పుకునే సక్సెస్ సినిమా లేదు. కానీ అతడు షూటింగ్ సమయంలో ప్రవర్తించే విధానం చూస్తే... అగ్రహీరోలకు ధీటుగా ఉంటున్నాడని ఇండస్ట్రీ భావిస్తోంది.

తాజాగా ఆయన "సమర్థుడు" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ షూటింగ్ రాజా వల్ల ఆలస్యమవుతోంది. అంతేగాకుండా రాజా గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలు విసిగిపోయి ఇక సినిమాలు తీయకూడదనే ఆలోచనలోకి వచ్చారు. ఇందులో కృష్ణంరాజు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ ఆయన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఎదురుకాలేదు.

ఇక అసలు విషయానికెళితే...
మేకప్ వ్యాన్ లేదని రాజా ఓ రోజు షూటింగ్ రద్దు చేశాడని తెలిసింది. దీంతో నిర్మాతలు అవాక్కయారు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి వారికి సెపరేట్‌గా మేకప్ వ్యాన్స్, రిలాక్స్ రూమ్స్ ఉంటాయి. ఓ రోజు మేకప్ వ్యాన్ ఆలస్యమైంది. దీంతో షూటింగ్‌ను కాన్సిల్ చేసుకోండని చెప్పి రాజా వెళ్లిపోయాడట..!

అలాగే మరో విషయం కూడా జరిగింది. "సమర్థుడు" చిత్రంలో ముంబైకి చెందిన ఓ హీరోయిన్‌ను బుక్‌చేసి రెండు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆమె తనకు వద్దు "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో నటించిన సంజన అనే అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టమని నిర్మాతల్ని ఒత్తిడి చేశాడు. దీంతో నిర్మాతలు చేసేది లేక.. రెండులక్షలు వదులుకుని తిరిగి సంజనను హీరోయిన్‌గా బుక్ చేశారు. దీంతో నిర్మాతలు ఏదోవిధంగా సినిమాను పూర్తిచేసి బయటపడాలని చూస్తున్నారు.

ఇంకేముంది.. అదండీ... రాజాస్థితి. సినిమాల్లో హీరోగా ఎన్నో నీతులు చెప్పినా... ఆచరణలో గోతులు తీసేరకమని నిర్మాతలు వాపోతున్నారు. హిట్స్‌లేకపోయినా ఆర్భాటం కావాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు న్యాయం..?
About Writer
SELVI.M