శివబాలాజీ, ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా రమేష్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "టార్గెట్". సిరిసాయి సూర్య మూవీస్‌పై పతాకంపై సంగిశెట్టి, దశరథ, బి.రామకృష్ణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్ధం చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన సంగిశెట్టి దశరథ మాట్లాడుతూ.. తమ చిత్రాన్ని చూసి స్పందించిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు.. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని చెప్పారు. గ్రాఫిక్ వర్క్, డిజిటల్ ఇంటర్మీడియట్‌ను చెన్నైలోని డిజిటల్ మ్యూజిక్ స్టూడియోలో చేయించామన్నారు. "మర్మకళ" నేపథ్యంలో ఈ సినిమా స్టైలిష్‌గా సాగుతుందని, ముమైత్‌ఖాన్ ఫైట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు.