చంద్రునిపై గజం భూమి కోటి రూపాయలే..!
|
పద్మశ్రీ కమల్‌హాసన్ నటించిన ఒకనాటి హిట్ చిత్రం "టిక్..టిక్..టిక్" అనే పేరుతో మళ్ళీ తెరపైకి వస్తోంది. కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి అరుణకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అరుణోదయా ఫిల్మ్‌వర్క్స్ పతాకంపై అరుణకుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌కు "యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ" అనే ఉపశీర్షికను కూడా జతచేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అరుణకాంత్ చిత్ర వివరాలు తెలియజేస్తూ... నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సరికొత్త కథ, కథనాలతో శరీరాన్నిగగుర్పాటుకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. మణిశర్మ సహాయకుడిగా పని చేసిన కానూరి అద్భుతమైన ట్యూన్స్ అందించారని దర్శకుడు చెప్పారు. కృష్ణభగవాన్, వేణుమాధవ్ పాత్రలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన అన్నారు.
శంకర్‌దాదా అనే రౌడీ క్రికెట్ టీమ్‌కి కోచ్‌గా, "భగవాన్‌సింగ్ ధోని" అనే పాత్రలో కృష్ణభగవాన్ కామెడీ కురిపించారని తెలిపారు. చంద్రమండలం మీద 25 ఎకరాల స్థలం కొని అక్కడ గజం కోటి రూపాయలకు అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వేణుమాధవ్ కామెడీ హైలెట్ అవుతుందని దర్శకుడు అన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.
ఇంకా చిత్రానికి కెమెరా...ఎస్.డి. జాన్, మాటలు... సీతారామరాజు, పాటలు...రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అరుణకాంత్.