రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా "హౌస్ఫుల్"
|
ఈ సినిమా గురించి నిర్మాత వివరాలను తెలియజేస్తూ.. రెండు పాటలు మినహా సినిమా మొత్తం పూర్తయిందన్నారు. ఇందులో ఐదుపాటలున్నాయని, అనూప్ రూబెన్స్ చక్కని సంగీతం సమకూర్చారని నిర్మాత వెల్లడించారు. ఈ నెల 15 నుంచి రామోజీ ఫిలింసిటీలో ఆ రెండు పాటల్ని చిత్రీకరించనున్నామని, నిక్సన్ నృత్యదర్శకత్వంలో హీరోహీరోయిన్లపై షూట్ చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆడియోను ఈ నెల 21న విడుదల చేస్తామని నిర్మాత తెలియజేశారు. ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ఇది గమ్మత్తైన కథని, విభిన్న స్క్రీన్‌ప్లేతో సినిమా నడుస్తుందని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా సాగుతూ... ప్రతి సన్నివేశమూ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుందని తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. జ్ఞానశేఖర్, ఆర్ట్... విశాల్, పాటలు.. చైతన్యప్రసాద్, పెద్దాడమూర్తి, అనంతశ్రీరామ్, భాషశ్రీ.