1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలయ్య ఎడ్లబండి తోలిన వేళ...!

వినోదం వెండితెర కథనాలు వైష్ణవి సినిమా పతాకం నందమూరి బాలకృష్ణ ప్రియమణి రాజమౌళి శిష్యుడు మహాదేవ్ ఆదిత్య 369 వంశానికొక్కడు శివలెంక కృష్ణప్రసాద్
WD
వైష్ణవి సినిమా పతాకంపై నందమూరి బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న కొత్తచిత్రం షూటింగ్ ఇటీవలే రాజోలు తదితర ప్రాంతాల్లో జరిగింది. రాజమౌళి శిష్యుడు మహాదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆదిత్య 369", "వంశానికొక్కడు" వంటి చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇందులో బాలకృష్ణ విదేశాల నుంచి తన పుట్టిన గడ్డకు వచ్చే సన్నివేశాన్ని గోదావరి తీరాన చిత్రించారు. ఎడ్లబండిపై వస్తూ ప్రకృతి అందాలకు పరవశించి ఓ పాటను పాడుతున్న సన్నివేశాన్ని అక్కడ చిత్రించారు. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై...ఇదే ప్రాంతంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... తన నిర్మాణంలో వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. చక్కటి విందు భోజనం లాంటి కథ ఇదన్నారు. బాలయ్య అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రముంటుందని నిర్మాత తెలిపారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కథ... విజయేంద్రప్రసాద్, మాటలు...ఎం. రత్నం, కెమేరా... బాలమురుగన్, పాటలు... వేటూరి, అనంతశ్రీరామ్, వెన్నెలకంటి.
About Writer
SELVI.M