దీపికా.. ఓ దీపికా... కనబడవా...
|
ఇంటర్నెట్ ప్రపంచంలో అగ్రగామి అయిన యాహు ఇండియా తమ వెబ్‌సైట్‌లో మోస్ట్ పాపులర్ సర్చెర్స్ జాబితాను ప్రకటించింది. 2008 సంవత్సరం చివరినాటికి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా దీపికా పదుకునే ఉన్నదని తెలిపింది.
ఇప్పటివరకూ అగ్రస్థానాలను దక్కించుకుంటున్న అందాల సుందరి ఐశ్వర్యారాయ్, పొడుగుకాళ్ల సుందరి శిల్పాషెట్టిలను వెనక్కినెట్టి వారి అందాలను మించిన అందగత్తెగా దీపికా అవతరించింది. అంటే 2008 దీపికకు లక్కీ ఇయర్ అన్నమాట.
అంతేకాదండోయ్ దీపికలాంటి అందగత్తెకోసమేకాక ఆయా ప్రభుత్వాలలో అవినీతి లుకలుకల గురించి, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ సంస్థల పనితీరులపైనా యూజర్లు కన్నువేశారట. అంటే ప్రపంచంలో ఎక్కువ అవినీతి చేపలన్నీ రాజకీయ మరియు ప్రభుత్వ సంస్థలలో ఉన్నాయని వీరి వెతుకులాటనుబట్టి తెలుస్తోంది కదూ.
ఇక మొబైల్ సెర్చెర్స్ విషయానికి వస్తే... అగ్రస్థానం క్రికెట్‌కే దక్కింది. ఆ తర్వాత స్థానాలను కత్రినాకైఫ్, బాలీవుడ్ గజినీ హీరోయిన్ అసిన్ కైవసం చేసుకున్నారు.