1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నా స్టైలే వేరు" అంటోన్న రాజశేఖర్

వినోదం వెండితెర కథనాలు నా స్టైలే వేరు రాజశేఖర్ భూమిక మాగంటి గోపినాథ్ జి రామ్ప్రసాద్
WD
డా. రాజశేఖర్, భూమిక కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి "నా స్టైలే వేరు" పేరును ఖరారు చేశారు. దిషిర ప్రొడక్షన్ పతాకంపై మాగంటి గోపినాథ్ నిర్మిస్తుండగా, జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... వైవిధ్యమైన కథ, కథనాలే ఈ చిత్ర విజయానికి దోహదపడతాయన్నారు. రాజశేఖర్, భూమిక పాత్ర స్వరూప స్వభావాల్లోని కొత్తదనం సగటు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయని నిర్మాత తెలిపారు. ఇప్పటికే టాకీ పూర్తయిందని, మూడు పాటలను ఈ నెలలోనే చిత్రీకరించనున్నామని ఆయన వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి మొదటివారంలో ఆడియోను, అదే నెలలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చిన కోన వెంకట్ పనితనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రాజశేఖర్ జీవితంలోకి భూమిక అడుగిడిన తర్వాత జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రమని రామ్ ప్రసాద్ అన్నారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఆకట్టుకునేవిధంగా ఉంటుందని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, విజయ్ కుమార్, దేవరాజు, చలపతిరావు, జీవా, బెనర్జీ, విజయరంగరాజు, పృథ్వీరాజ్, అన్నపూర్ణ, సురేఖావాణి, రుద్ర, కల్పన, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు. సంగీతం... అనూప్, కెమేరా... ఎస్. అరుణ్ కుమార్, పాటలు... సుద్దాల, చైతన్యప్రసాద్, భాస్కరపట్ల, చిర్రావూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.. విజయ్, వి. ప్రదీప్ చౌదరి.
About Writer
SELVI.M