1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"వరుడు" సెట్‌పైకి వస్తున్నాడు..!

వినోదం వెండితెర కథనాలు వరుడు సెట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సింగమల రమేష్ బాబు పార్వతి మెల్టన్ రాణా సురేష్ బాబు తనయుడు
27న "వరుడు"...!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభిమానులకో శుభవార్త. మహేష్ బాబు తాజా చిత్రం "వరుడు" షూటింగ్ ఈ నెల 27న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ సినిమా తర్వాత 8 నెలలు గ్యాప్ తీసుకుంటానని చెప్పిన మహేష్ బాబుకు ఎట్టకేలకు కథ సిద్ధం కావడంతో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, సింగమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 27న లాంఛనంగా ప్రారంభం కానుందని తెలిసింది. ఇందులో పార్వతి మెల్టన్ హీరోయిన్‌గా నటించనుంది.

22న "రాణా" అరంగేట్రం..!
డా. డి. రామానాయుడు మనుమడు డి. సురేష్ బాబు తనయుడు రాణా హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రాన్ని ఈ నెల 22న అరంగేట్రం చేయనున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం చక్కని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. "ఆనంద్", "హ్యాపీడేస్" తరహాలోనే చక్కని పాటలు, కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేశారు.
About Writer
SELVI.M