"మై నేమ్ ఈజ్ అమృత" ఆడియో ఆవిష్కరణ
|
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినిమా తీయాలనే కోరికతో మొదట నిర్మాత తన దగ్గరకు వచ్చారని వెల్లడించారు. ఇక్కడి పరిస్థితులు నిర్మాతకు వివరించానని, అయినప్పటికీ ధైర్యంగా తను తీయాలనుకున్న కథను పూసగుచ్చినట్లు లాప్‌టాప్‌లో చూపించారని కళ్యాణ్ తెలిపారు. మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని... నిర్మాత మంచి అభిరుచి గల వ్యక్తి అని కళ్యాణ్ కొనియాడారు.
చిత్ర నిర్మాత వెంకట్ గౌని మాట్లాడుతూ.. ఇంతకుముందు గ్రాఫిక్స్ రంగంలో ఉన్నానని, "చందమామ"కు తానే గ్రాఫిక్ వర్క్ చేశానని వెల్లడించారు. రొటీన్ ప్రేమకథా చిత్రాలు కాకుండా, కొత్తదనంతో కూడిన చిత్రం తీయాలనే ఉద్దేశంతో " మై నేమ్ ఈజ్ అమృత" సినిమాను రూపొందించేందుకు పూనుకున్నానని చెప్పారు.
దర్శకుడు అంతోని మాట్లాడుతూ... కులం, మతాన్ని చర్చిస్తూ సందేశాత్మక చిత్రంగా దీనిని మలిచామని, ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
టైటిల్ పాత్రధారిణి బేబి గాయత్రి మాట్లాడుతూ... ఈ చిత్రానికి అవార్డు వస్తుందనే నమ్మకముందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ కీర్తి, ఆర్.కె. చంద్ర సిద్ధార్థ, రచయిత రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.