1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రవితేజ, ఇలియానాల "కిక్"

వినోదం వెండితెర కథనాలు ఇడియట్ నేనింతే కిక్ ఇలియానా రవితేజ ఆర్ఆర్ మూవీ మేకర్స్ వేసవి కానుక
WD
"ఇడియట్", "నేనింతే" వంటి విభిన్నమైన టైటిల్ రోల్స్‌ను పోషించిన యువహీరో రవితేజ తాజాగా "కిక్" అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ అగ్రహీరోయిన్, అందాల ముద్దుగుమ్మ ఇలియానా జోడీగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించనున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
About Writer
SELVI.M