1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మార్చి 9న ప్రభాస్, పూరీ కొత్త చిత్రం..!

వినోదం వెండితెర కథనాలు మార్చి 9 ప్రభాస్ పూరీ కొత్త చిత్రం ఆదిత్యారామ్
యువ హీరో ప్రభాస్ కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ సమర్పణ, దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మార్చి 9న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాత ఆదిత్యారామ్ ప్రకటించారు. పూరీ, ఆదిత్యారామ్ సంయుక్తంగా... ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... ప్రభాస్‌ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న తాజా చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెబుతూ... తాను సమర్పకుడిగా ఆదిత్యారామ్ నిర్మిస్తున్న పది చిత్రాల్లో ప్రభాస్ హీరోగా తొలి చిత్రం మార్చి 9న ప్రారంభం కానుందన్నారు. "బుజ్జిగాడు" తర్వాత ప్రభాస్‌తో తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అధునాతన సాంకేతిక విలువలుంటాయని పూరీ చెప్పారు.


నిర్మాత మాట్లాడుతూ.. ఏకధాటిగా సాగే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభాస్ కెరీర్‌లోనే ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుదని చెప్పారు.

ఇంకా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు... పూరీ జగన్నాథ్.
About Writer
SELVI.M