బైబిల్ వండర్స్ ఆధారంగా "కాపరి"
|
అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో జీసెస్‌పై ఓ చిత్రం తీయాలనే కోరిక ఉందని, ఐరీన్ తాళ్ళూరికి కథ చెప్పానని అన్నారు. రెండేళ్ల తర్వాత చేద్దామన్నారని, అనుకున్నట్లుగా రెండేళ్ల తర్వాత ఈ సినిమా తీయడం సాధ్యపడిందని వెల్లడించారు. ఏకధాటిగా జరిగే ఈ షూటింగ్ ఈ సినిమా ఆరు నెలల్లోపే పూర్తవుతుందని, కథను బట్టి జెరూసలెంలో కూడా షూటింగ్ చేస్తామని చెప్పారు.
నిర్మాత ఐరీన్ తాళ్ళూరి మాట్లాడుతూ... ముఖ్యంగా నేడు యువత కల్లోలంగా ఉందని, తాము ఏమిటో తెలుసుకునే స్థితిలో లేరని చెప్పారు. ఈ సినిమా ద్వారా వారికి ఓ మంచి సందేశం చెప్పగలుగుతామని ఐరీన్ తెలిపారు. బైబిల్‌లో పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథంలోని అద్భుతాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని, శాంతి, సమాధానం, సత్యం వీటి ప్రాతిపదికన కథ రూపొందుతోందన్నారు. ఈ నెల 27 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ.. బైబిల్ చిత్రమైనా ఇందులోని సాహిత్యంలో "పంచాక్షరి" పదం వాడాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆ పాదాన్ని తీయాలనుకున్నామని, కానీ చిత్ర నిర్మాత బైబిల్‌లోనే పంచాక్షరి ఉన్న విషయాన్ని చెప్పారని వెల్లడించారు. ఇందులో ఉన్న 8 పాటలకు రీరికార్డింగ్ పూర్తయిందని సంగీత దర్శకుడు తెలిపారు.
జీసెస్ పాత్రధారి నోయల్ సంజీత్ మాట్లాడుతూ... యుఎస్‌లో ఏరోలైన్స్‌గా పనిచేసే వాడినని, బైబిల్ పాత్రకోసం దాన్ని వదులుకుని ఇక్కడకు వచ్చానని చెప్పారు. వైజాగ్‌లో నటనలో శిక్షణ పొందానని నోయల్ అన్నారు.
ఇంకా మిగిలిన పాత్రల్లో జానీలివర్‌తో పాటు ఇతర భాషా నటీనటులు కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ... బెన్‌హర్, సినిమాటోగ్రాఫర్.. ముజీర్, పాటలు.. ఐరీన్ తాళ్ళూరి, సుధాకర్ మారియో, శ్యాంబాబు, నిర్మాణ సారధ్యం... ఆర్. పుష్పలత.