1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఇక సినిమాలు చేసింది చాలు..నాతో వచ్చేయ్..!

వినోదం వెండితెర కథనాలు ఇక సినిమాలు చాలు చంద్రబాబు నాయుడు శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం బాబూ మోహన్
WD
ఇక సినిమాలు చేసింది చాలు.. సినిమా కోసం చేసిన నీ పోరాటం చాలు. నీ సేవలు రాజకీయాలు కావాలి. నాతో వచ్చేయ్... అంటూ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బాబూమోహన్ నుద్దేశించి అన్నారు.

బాబూమోహన్ కుమారుడు ఉదయ్ హీరోగా "శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం" సినిమా అర్థశతదినోత్సవ వేడుకలకు మంగళవారం రాత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నువ్వు మా పార్టీ సభ్యుడివి, కాబట్టి మా పార్టీ పరువు నిలబెట్టే మంచి చిత్రాలు తీయాలని బాబూమోహన్‌కు సూచించారు. అదేవిధంగా కీలక పాత్రలు పోషించి, మంచి హీరోగా ఎదగాలని బాబూమోహన్ కుమారుడు ఉదయ్‌కు హితవు పలికారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకరరావు, కోడిరామకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, అచ్చిరెడ్డి, కోటశ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్, నర్రా తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం విడుదల సమయంలో కొన్ని థియేటర్లు మూడు రోజుల్లోనే సినిమా ఎత్తేసి, బాక్స్‌లు కూడా వెనక్కు ఇవ్వని ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బాబూమోన్ మీడియా ద్వారా తన ఆవేదన వెల్లగక్కారు. అంతటితో సద్దుమణిగిన ఈ సినిమా చేదు అనుభవాలను చవిచూసి విజయవంతంగా అర్థశతదినోత్సవ వేడుకలకు చేరుకోవడం గమనార్హం.
About Writer
SELVI.M