"కలవరమాయే మదిలో" అంటోన్న కలర్స్ స్వాతి
|
దర్శకుడు మాట్లాడుతూ.. స్వాతి అనే అమ్మాయి కథే ఈ చిత్రమని, సింగర్ అవ్వాలనేది ఆమె కలని, కానీ మధ్యలో ఓ యువకుడు వచ్చి ఆమె మదిని కలవరపెడుతుంటాడని చెప్పారు. మొత్తానికి ఆమె కల నెరవేరిందా? లేదా? అనేదే చిత్రమని దర్శకుడు వివరించాడు. ఈ కథ దిల్‌రాజుకు తెలుసునని, అందుకే తన వద్ద ఉన్న చక్కని టైటిల్‌ను తన చిత్రానికి ఇచ్చారని చెప్పారు.
ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుందని, ఏకధాటిగా సాగే షూటింగ్‌తో రెండు నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేస్తామని సతీష్ కాసెట్టి అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారని చెప్పారు. ఇందులో పది చక్కని పాటలుంటాయని, సంగీత నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాత వెల్లడించారు.