"నేను దేవుడ్ని" అంటోన్న బాల
|
ఈ సందర్భంగా బాలా మాట్లాడుతూ.. ప్రతి మనిషి నేను దేవుడ్ని అనుకుంటారని, ప్రతి మనిషిలోనూ దేవుడుంటాడనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ... తాను తమిళంలో చేసిన రెండు సినిమాలు తెలుగులోకి అనువదించారని, ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించారు.
నిర్మాత శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డానని, ఆర్య తన పాత్రకు అనుగుణంగా నటించేందుకు చాలా శ్రమించాడని కొనియాడారు. తెలుగులో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 50 సంవత్సరాల నుంచి ఈ పతాకంపై సినిమాలను నిర్మిస్తున్నారని, బాల చిత్రాలు ఆలోచించేవిగా ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం కూడా అలాగే ఉంటుందని, ఫిబ్రవరి ఆరున చిత్రాన్ని విడుదల చేస్తున్నారని చెప్పారు.