1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బ్లాక్ కమెండోగా కృష్ణభగవాన్..!

వినోదం వెండితెర కథనాలు బ్లాక్ కమెండో కృష్ణభగవాన్ వా నీడ శిల్ప జ్యోతి బాబు గణేష్ చిరంజీవి ఎంజీఆర్
బ్లాక్ కమెండోగా కృష్ణభగవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న "వా" (నీడ) అనే చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. బాబు గణేష్ కథానాయకుడిగా శిల్ప, జ్యోతి కథానాయికలుగా నటిస్తున్నారు. జి. బాబు గణేష్ తన స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపుషాట్‌ను హీరోహీరోయిన్లపై చిత్రించారు. దీనికి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, జ్యోతిప్రసాద్ కెమేరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ.. తమిళంలో గత ఏడాది "నడిగై" అనే చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు. చిత్రరంగంలోని 24 క్రాఫ్ట్స్‌లోనూ తనకు ప్రవేశముందని, ఇందులో కృష్ణభగవాన్ కమెండోగా నటిస్తున్నారని చెప్పారు.

ఇందులో.. ఏదో సాధించాలనుకుని ప్రముఖులైన ఎం.జి.ఆర్, చిరువంటి వారిని ఊహించుకుని కాలం వెళ్ళగిచ్చే పాత్రలో కృష్ణభగవాన్ కనిపిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఓ సంఘటనతో.. సస్పెన్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుందని గణేష్ చెప్పారు. తొలిషెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనూ మలి షెడ్యూల్ కొలంబోలోనూ చిత్రీకరించాలనుకుంటున్నామని చెప్పారు.

కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. దర్శకుడు కథను ఫోన్‌లో చెప్పగానే అంగీకరించానని, గణేష్ మంచి టేకింగ్ గల దర్శకుడని, ఇందులో కలలో విహరించే వైవిధ్యమైన పాత్ర తనదని తెలిపారు.

సంగీత దర్శకుడు లక్ష్మీ వినాయక్ మాట్లాడుతూ.. సంగీతానికి అవకాశమున్న కథన్నారు. ఇంకా ఈ చిత్రంలో కోవై సరళ, ముంతాజ్, అనిత, హేమ సుందర్, పొట్టి రాంబాబు, రామిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా.. వై.వి.నవీన్ కుమార్, మాటలు, పాటలు... పొందూరి, కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, నిర్మాత, దర్శకత్వం... జి. బాబు గణేష్.
About Writer
SELVI.M