ఆస్ట్రియా వెళుతున్న "రాజు-మహారాజు"
|
ఇందులో భాగంగా.. "నా గుండెను పట్టి కుంపటి పెట్టి..." అనే పాటను నోబుల్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో హీరోహీరోయిన్లు, కొంతమంది డ్యాన్సర్లపై గోల్కొండ ఫోర్ట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కందికొండ సాహిత్యాన్ని అందించారు.
ఈ చిత్ర విశేషాలను చిత్ర నిర్మాత కుమారస్వామి పత్తికొండ తెలియజేస్తూ.. తన పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చక్కని కథతో తెరకెక్కనుందన్నారు. ఈ సినిమాను ఏ మాత్రం రాజీపడకుండా, మంచి లవ్‌స్టోరీ, హార్ట్ టచింగ్ ఫ్యామిలి సెంటిమెంట్స్‌ను జోడించి రూపొందిస్తున్నామని చెప్పారు.
మోహన్ బాబు, రమ్యకృష్ణ ఈ మూవీలో నటించేందుకు అంగీకరించడంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి క్రేజ్ వచ్చిందని కుమారస్వామి వెల్లడించారు. ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్ల నుంచి డైరక్టర్ భానుశంకర్ మంచి అవుట్‌పుట్ తీసుకుంటున్నారని, రెండు పాటల చిత్రీకరణ కోసం ఫిబ్రవరిలో యూనిట్ ఆస్ట్రియా బయలుదేరనుందని నిర్మాత తెలియజేశారు. అలాగే కాప్రిలో శర్వానంద్, మరో హీరోయిన్ తసు కౌశిక్‌లపై మరో సాంగ్ చిత్రీకరించనున్నామని వివరించారు. అన్నివిధాలా రాజు-మహారాజు సక్సెస్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
నటీనటులు.. మోహన్‌బాబు, రమ్యకృష్ణ, శర్వానంద్, సుర్విన్ చావ్లా, తసుకౌశిక్, నాజర్, నూతన్ ప్రసాద్, విజయ్ కుమార్, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, రఘునాథరెడ్డి, చంద్రమోహన్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, ఎల్.బి. శ్రీరాం, రఘుబాబు, భరత్, విజయ్, భార్గవి, సురేఖావాణి, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు.
సాంకేతిక నిపుణులు... సినిమాటోగ్రఫీ.. రమేష్ బాబు, సంగీతం... చక్రి, ఎడిటర్.. కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు.. జీవన సత్యం, పాటలు.. భాస్కరపట్ల రవికుమార్, కందికొండ, రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్.. కణల్ కన్నన్, కొరియోగ్రఫీ... తరుణ్, నోబుల్, ప్రేమ్ రక్షిత్, ఆర్ట్.. జె.కె. మూర్తి, పబ్లిసిటీ.. ధని ఏలె, ప్రొడక్షన్ కంట్రోలర్.. ఎస్.బి.ఎన్. రాజు, నిర్మాత..కుమారస్వామి పత్తికొండ, దర్శకుడు.. భానుశంకర్.