"అధినేత" మొదటి షెడ్యూల్ పూర్తి
|
ఈ షెడ్యూల్ గురించి దర్శకులు సముద్ర మాట్లాడుతూ.. భద్రాచలం ఆలయంలో ఓ పాటను, గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని, విలేజ్ వాతావరణంలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. హీరో జగపతిబాబు ఇంట్రడక్షన్ ఫైట్‌ను కూడా ఇదే షెడ్యూల్‌లో చిత్రీకరించామని సముద్ర వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి ఏకధాటిగా హైదరాబాద్ పరిసరాల్లో చేసే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
జగపతిబాబు, శ్రద్ధాదాస్, నీలిమ, ఆహుతిప్రసాద్, మురళీ శర్మ (అతిథి ఫేం), డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, అన్నపూర్ణ, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు... పరుచూరి బ్రదర్స్, సంగీతం... శ్రీకాంత్, దేవా, ఫోటోగ్రఫీ... ప్రసాద్‌బాబు, ఎడిటింగ్.. నందమూరి హరి, ఫైట్స్.. డిఫరెంట్ డానీ, ఆర్ట్.. రమణ వంక.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. ఎం.ఎస్.కుమార్, సమర్పణ.. సదాశివుని రవి (న్యూజెర్సీ), నిర్మాత.. కె.కె. రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. సముద్ర వి.