నేపథ్య గాయకుడు క్రిష్‌తో సంగీత పెళ్లి
"పెళ్లాం ఊరెళితే", "ఖడ్గం" "బహుమతి" వంటి హిట్ సినిమాలతో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ సంగీత పెళ్లి చేసుకుందండీ...! ఇదేదో గాలి వార్త కాదండీ బాబూ... నిజమే..!. యువ సినీ నేపథ్య గాయకుడు క్రిష్‌తో ఆమె వివాహం వైభోగంగా జరిగింది.
గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు. ఇటీవల నటి మహేశ్వరి వివాహానికి వీరిద్దరూ జంటగా కూడా వెళ్లారు. అక్కడే సంగీత, క్రిష్‌ల పెళ్లి జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ఆ తర్వాత ఈ వార్తలను సంగీత-క్రిష్‌లు ఖండిస్తూ.. "ఫిబ్రవరి"లో తమ వివాహం జరుగనుందని మీడియా ముందు ప్రకటించారు. వీరిద్దరు చెప్పినట్లే.. ఫిబ్రవరి ఒకటోతేదీన క్రిష్-సంగీతల పెళ్ళి ఘనంగా జరిగింది. తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రమైన తిరువణ్ణామలైలో వీరి వివాహం జరిగింది.
ఇకపోతే.. సంగీత-క్రిష్ వివాహానికి వారి బంధువులు, సన్నిహితులు, వెంకట్ ప్రభు, బాల, ధరణి, ఆచార్య రవి, ముంతాజ్, మహేశ్వరి, రాజేశ్వరి, లక్ష్మీరాయ్, శ్రీ ప్రియ, ఎస్పీబి. చరణ్, పాండ్యరాజన్ వంటి ప్రముఖ సినీ నటులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా... పెద్దల అంగీకారంతోనే తమ పెళ్లి జరుగుతుందని సంగీత-క్రిష్‌లు ఇటీవల వెల్లడించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పడం అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంగీత తెలిపింది. 10 నెలల క్రితం ఓ టీవీ కార్యక్రమంలో తామిద్దరం కలుసుకున్నామని, నాటి పరిచయమే ప్రేమగా మారిందని క్రిష్ తెలిపారు.
మరోవైపు... కోలీవుడ్ సింగర్‌గా క్రిష్ రాణించగా... ప్రస్తుతం సంగీత టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తానికి ఈ ప్రేమజంట ఒక్కటవడం తమిళ, తెలుగు సినీ పరిశ్రమలను ఆనందంలో ముంచెత్తింది. మనం కూడా... క్రిష్-సంగీతలు కలకాలం సంతోష సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆశిద్దామా..!