1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నయనతారపై బహిష్కరణ వేటు...!

వినోదం వెండితెర కథనాలు నయనతార బహిష్కరణ వేటు తమిళ నిర్మాతల మండలి పరుత్తివీరన్ పయ్యా అడ్వాన్స్
దక్షిణాది సినీ తార నయనతారపై తమిళ నిర్మాతల మండలి బహిష్కరణ వేటు వేసింది. పరుత్తివీరన్ ఫేమ్ కార్తీ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో రూపొందించనున్న "పయ్యా" అనే కోలీవుడ్ చిత్రంలో మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నారు.

నయనతారకు కోటి రూపాయలు పారితోషికం చెల్లించేందుకు నిర్మాత సుభాష్ చంద్రబోస్ అంగీకరించి, ఆమెకు 25లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా తీయలేకపోతున్నానని, తానిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా నిర్మాత నయనతారను కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో నిర్మాత ఆగ్రహించి సినీ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.

చంద్రబోస్ ఫిర్యాదును పరిశీలించిన తమిళ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ మరియు సౌత్‌ ఇండియా ఫిల్మ్ యాక్టర్స్ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్మాతను ఇబ్బంది పెట్టిన నయనతారను బహిష్కరించింది. అయితే ఈ సినిమా కోసం నిర్మాతకు డేట్స్ ఇచ్చి తాను నష్టపోయాయనని నయనతార వాదిస్తోంది.

ఇదిలా ఉండగా.. తమిళ సినీరంగం నుంచి బహిష్కరణకు గురైన నయనతారను.. టాలీవుడ్, మలయాళ సినీరంగాలు కూడా వెలివేసే అవకాశాలు కన్పిస్తున్నాయని సినీ వర్గాల సమాచారం. నయనను బహిష్కరించాలని పేర్కొంటూ టాలీవుడ్, మలయాళ సినీ రంగాలకు తమిళ నిర్మాతల మండలి ఓ లేఖ రాసినట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
About Writer
SELVI.M